జనగామ/ హనుమకొండ సిటీ/ ములుగు/ ఖిలావరంగల్, వెలుగు: వచ్చే వేసవిలో విద్యుత్‌కోతలు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో ప్రాజెక్ట్ డైరెక్టర్, జనగామ నోడల్ ఆఫీసర్ సదర్లాల్, హనుమకొండ నోడల్ ఆఫీసర్మధుసూదన్, జయశంకర్భూపాలపల్లి నోడల్ ఆఫీసర్ బీకాం సింగ్, వరంగల్ నోడల్ ఆఫీసర్ రాజుచౌహాన్ అన్నారు. బుధవారం వారు ఆయా జిల్లా కేంద్రాల్లో వేర్వేరుగా విద్యుత్‌శాఖ ఇంజినీర్లతో సమ్మర్ యాక్షన్ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. వేసవిలో గృహ వినియోగదారులు, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు.
అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జనగామలో ఇప్పటికే 5 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, రెండు నూతన 33 కేవీ విద్యుత్ లైన్లు, నాలుగు 11 కేవీ అదనపు బ్రేకర్లు, 26 అదనపు ట్రాన్స్ఫార్మర్లను సుమారు రూ.5.2 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 397 ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్ లోడ్ ఉందని, 39 ట్రాన్స్ ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడకండా చేశామన్నారు.
ఇంకా 358 ట్రాన్స్ ఫార్మర్లపై ఓవర్ లోడ్ లేకుండా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 11 ఫీడర్లలో పనులు జరుగుతున్నాయని ఫిబ్రవరి 10 లోగా ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు. వరంగల్ జిల్లాలో 474 ట్రాన్స్ ఫార్మర్ లు ఓవర్ లోడ్ కలిగి ఉన్నాయని, 104 ట్రాన్స్ ఫార్మర్ల పనులు పూర్తయ్యాయని, ఇంకా 370 ట్రాన్స్ ఫార్మర్ల పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ పనులను 15 కోట్లతో చేస్తున్నామని చెప్పారు. సమీక్షలో ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.